Site icon TeluguMirchi.com

Roti Kapada Romance : ‘రోటి క‌ప‌డా రొమాన్స్’ ఎమోష‌న‌ల్ డోస్ ప్రీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన హీరో శ్రీ‌విష్ణు


హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల కానుంది. ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.

LPG Gas : మహిళలకు మోదీ కానుక.. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింపు

తాజాగా ఈ చిత్రం ఎమోష‌న‌ల్ డోస్ ప్రీట్రైల‌ర్‌ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నాకు ఈ బ్యాన‌ర్ ఎంతో ల‌క్కీగా ఫీల‌వుతాను. ఈ సంస్థ‌తో నాకున్న అనుబంధం గొప్ప‌ది. ఈటీమ్‌ను చూస్తుంటే నేను ఈ బ్యాన‌ర్‌లో చేసిన సినిమా రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఈ చిత్రం టీజ‌ర్‌, ఈ ఎమోష‌న‌ల్ టీజ‌ర్‌, పాట చూస్తుంటే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా ఈ వేస‌వికి పెద్ద హిట్ అవుతుంద‌ని అనిపిస్తుంది. అంద‌రూ ఏప్రిల్ 12న ఈ సినిమా ను చూసి ఈ సినిమాను ఆద‌రించాలి కోరుకుంటున్నాను. మ‌ళ్లీ స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అన్నారు.

Emotional Dose Of #RotiKapdaRomance | Bekkem Venu Gopal, Vikram Reddy, Srujan Kumar Bojjam

Exit mobile version