అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి తనయుడు ఆకాష్ హీరోగా పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం రొమాంటిక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం మే 29 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసారు కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక షూటింగ్ లకు అనుమతి రావడమే ఆలస్యం మిగిలి ఉన్న సన్నివేశాలను పూర్తి చేసి సినిమాను థియేటర్స్ లోకి తీసుకరావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షాట్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య నడిచే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా సెట్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట.