Site icon TeluguMirchi.com

రోజా…. కనిపించుటలేదు !!

roja-ysrcpగత కొంత కాలంగా వైఎస్ ఆర్ సి పి నాయకురాలు రోజా ఎంత వెతికినా రాజకీయ వేదికలపైన కనిపించటం లేదు. ఒక చానెల్ లో తోటి ఆడవాళ్ళతో దాన్సులేస్తూ, మరో చానెల్ లో ఓ కామెడి ప్రోగ్రాం అని చెప్పుకునే ఒక బూతు జోకుల కార్యక్రమంలో కృత్రిమంగా నవ్వుతూ మాత్రమే ఆమె దర్శనమిస్తోంది. అవసరం వున్నా లేకపోయినా ఎదుటి రాజకీయ పార్టీల వారిని తిట్టి దుమ్మెత్తి పోసే రోజా గత కొంతకాలంగా టీవీ కార్యక్రమాలకే పరిమితం అయిపోతోంది.

జగన్ పార్టీ తరపున ఆమె గతంలోలాగా చురుకుగా పనిచేస్తున్న దాఖలాలు ఏమీ పించటంలేదు. ఈ నేపధ్యంలో కావాలనే జగన్ ఈమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంచాడా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. తొలుత తెలుగుదేశం పార్టి లో మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ఆ పార్టీలో ఎంతో చురుకుగా పనిచేసారు. ఆ తరువాత అకారణంగానే ఆమె అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కొద్దిరోజులకే వైఎస్ దుర్మరణం పాలవటంతో అప్పట్లో అందరూ ఈమెను ‘ఐరన్ లెగ్ రోజా ‘ అన్నారు. వైఎస్ మరణానంతరం ఈమె జగన్ పార్టీలో చేరారు. చేరినప్పటినుంచి ఈమెకు పార్టీలో మంచి స్థానమే దక్కింది. అవకాశం దక్కిందే తడవుగా ఈమె ఇటు చంద్రబాబును అటు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది.

ఎదుటి వారిని ముక్కూ మొహం లేకుండా తిట్టడంలో ఒకపక్క అంబటి రాంబాబు, మరో పక్క రోజా లు వై ఎస్ ఆర్ సి పి కి అండగా నిలిచారు. అయితే క్రమేపి రోజా పాత్ర తగ్గుతూ వస్తోంది. టీవీ షో లలో ఆమె పాల్గొంటున్న కారణంగా ఆమె పొలిటికల్ ఇమేజ్ దారుణంగా పడిపోతుందనే భావనకు పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యన ఇదే ప్రశ్నను అడిగిన విలేకరులకు రోజా సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. తాను స్థానిక ఎన్నికల హడావిడిలో నియోజకవర్గంలో బిజీ బిజీ గా తిరుగుతున్నానని, అందువల్లనే పార్టీ కార్యకలాపాలలో గతంలో లాగా చురుకుగా పాల్గొన లేక పోతున్నానని ఆమె చెప్పింది. వాస్తవానికి పార్టీ లో ఇంకా ఈ హడావిడి ఎ స్థాయిలోనూ మొదలు కానేలేదు. పైగా రోజా హైదరాబాద్ లోనే ఉంటోంది. ముమ్మరంగా షూటింగులలో పాల్గొంటోంది. ఇవన్ని గమనిస్తే రోజాకు తన పార్టీ లో గతంలో లాగా గ్రిప్ లేదన్న విషయం స్పష్టం అవుతోంది.

Exit mobile version