రియా ఎప్పుడైనా సిద్దమే..

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది.

రంగంలోకి దిగిన సిబిఐ కేసును క్షణ్ణంగా పరిశీలిస్తూ సంచలన విషయాలు బయటకు తీస్తున్నారు. ఈ కేసు విషయంలో తాజాగా మాదక ద్రవ్యాల అంశం వెలుగులోకి వచ్చింది. మాదక ద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తాజాగా బయటపడింది. సుశాంత్‌తో కలిసి రియా కూడా డ్రగ్స్ తీసుకునేదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రియా తరఫు న్యాయవాది స్పందించారు. రియా ఎప్పుడూ మాదక ద్రవ్యాలు తీసుకోలేదు. రక్త పరీక్షకు రియా ఏ సమయంలోనైనా సిద్ధమేనని ఆయన వెల్లడించారు.