పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టిందట. లాక్ డౌన్ వేళ అభిమానులతో ముచ్చటించిన ఈ భామ తన తాజా ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి కారణం ‘పెళ్ళిచూపులు’ తర్వాత తనకు తెలుగులో ఆసక్తికరమైన కథలేవీ దొరకలేదట. అదే సమయంలో తమిళం నుంచి అవకాశాలు వచ్చాయి. ఫలానా భాషలోనే నటించాలి, ఫలానా పాత్రలే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు.
అందుకే తమిళంలో చేశాను అని తెలిపింది. ఇప్పుడు కొత్తగా మరో సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. నిఖిల్ ‘కార్తికేయ 2’లో ‘రీతూ వర్మ’ నటించబోతుందట. ఇక ఇప్పటికే ‘రీతూ వర్మ’ శర్వానంద్‌తో ఓ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక సెట్స్ మీద నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నది. మొత్తం మీద రీతు ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారింది.