సంచలన దర్శకులు రామ్ గోపాల్ గురించి ఏంచెప్పిన..ఎలా చెప్పిన తక్కువే..ఎందుకంటే గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమైతే..వర్మ మాత్రం ఈ రెండు నెలలలో కరోనా ఫై సినిమా తీసి వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.
కరోనా ట్రైలర్ చూస్తుంటే లాక్ డౌన్ సమయంలో ఓ కుటుంబం ఇంట్లో ఎలా ఉంటోంది. వారి మధ్య ఉండే సాన్నిహిత్యం అభిప్రాయ బేధాలు భార్య భర్తల మధ్య రిలేషన్ వంటి విషయాలను ప్రస్తావించి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
ఓ నెటిజన్ ఆర్జీవీని ఉద్దేశిస్తూ “మీరు ఇంట్లో గిన్నెలు కడగరు. బట్టలు ఉతకరు. ఇల్లు తుడవరు. లాక్ డౌన్లో ఏ ఒక్క ఇంటి పనిని చేయలేదు. మేం మీ కోసం ట్వీట్లు చేయం” అంటూ చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు. “ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా దర్శకులు హీరోలు సింగర్లు ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే.. నేను ఓ సినిమా తీసేసాను” అని గొప్పలు చెప్పుకుంటూ కండలు తిరిగిన ఎమోజీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Ahem! When the going gets tough, the tough get going ??? Thanks Akshaye ? https://t.co/1tAAnTq1NB
— Ram Gopal Varma (@RGVzoomin) May 27, 2020