Site icon TeluguMirchi.com

‘రావణాసుర’ థర్డ్ సింగిల్ ‘వెయ్యినొక్క జిల్లాల వరకు..’


మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ థ్రిల్లింగ్ ఎక్సయిటింగ్ టీజర్‌తో క్యురియాసిటీని పెంచింది. టీజర్ రవితేజని డిఫరెంట్ షేడ్స్ లో చూపుతుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. మూడవ సింగిల్ వేయినొక్క జిల్లాల వరకు ప్రోమోతో ఆసక్తిని పెంచిన మేకర్స్ తాజాగా లిరికల్ వీడియోతో ముందుకు వచ్చారు.

సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తన అద్భుతమైన కంపోజిషన్‌తో మనల్ని 80వ దశకంలోకి తీసుకెళ్లారు. రెట్రో స్టయిల్ లో సాగే ఈ పాట వెంకటేష్ ‘సూర్య IPS’లోని సూపర్‌హిట్ పాట వెయ్యినొక్క జిల్లాలకు రీమిక్స్ వెర్షన్. కొత్తపాటలో కొన్ని ఫాస్ట్ బీట్‌లు, రవితేజ క్రేజీ డ్యాన్స్‌లు కన్నుల పండుగగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ నుండి సెట్స్ వరకు, మేకర్స్ రెట్రో లుక్ అనుభూతిని ఇవ్వడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పాటలో మేఘా ఆకాష్ కూడా కనిపించారు. లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తన అందమైన సాహిత్యంతో పాటకు క్లాసిక్ టచ్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి పెప్పీ వోకల్స్ దీనిని మరింత ప్రత్యేకంగా చేసింది. శేఖర్ మాస్టర్ కూడా తన కొరియోగ్రఫీతో విజువల్స్‌కి రెట్రో స్టైల్‌ని తీసుకొచ్చాడు. ఇక ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.

Veyyinokka Lyrical | Ravanasura | Ravi Teja, Megha Akash | Harshavardhan Rameshwar | Sudheer Varma

Exit mobile version