Rashmika Mandanna : వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న భారీ విరాళం


Rashmika Mandanna : కేరళ వయనాడ్ లో ఇటీవల ప్రకృతి సృష్టించిన విషాధం అంతా ఇంతా కాదు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి రాత్రికి రాత్రే పలు గ్రామాలు నేలమట్టం అయ్యాయి. ఎన్నో ప్రాణాలు నిద్దుర లోనే కన్ను మూసాయి. దాదాపు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. ఈ ఘటన పట్ల రష్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.

Also Read :  AA22 : సైలెంట్ గా #AA22 పూజా కార్యక్రమం ?

Also Read : Bigg Boss Telugu 8 : వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు !

ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. మరోవైపు సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి 50 లక్షలు.. కమల్ హాసన్ 25 లక్షలు.. మోహన్ లాల్ 25 లక్షలు.. విక్రమ్ 20 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం వయనాడ్ బాధితుల కోసం తమ వంతు సాయాన్ని అందజేస్తున్నారు. ఇకపోతే రష్మిక మందన్న ప్రస్తుతం ‘పుష్ప 2’ ది రూల్ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ ‘సికిందర్’ లో నటిస్తోంది. ఆమె ఖాతాలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.

Also Read :  AA22 : సైలెంట్ గా #AA22 పూజా కార్యక్రమం ?

Also Read : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్..