Site icon TeluguMirchi.com

కంటి సమస్య ఫై రాశి క్లారిటీ ..

గోకులంలో సీత , శుభాకాంక్షలు వంటి ఫ్యామిలీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి..ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఈ మధ్య మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అవ్వగానే లాక్ డౌన్ వచ్చి పడింది. అయితే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండడం , అప్పుడప్పుడు పలు టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇవ్వడం చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఇటీవల సోషల్ మీడియా లో ఈమె ఫోటోలు చూసిన నెటిజన్లు , అభిమానులు ఆమె ఎడమ కన్నులో ఏదో సమస్య ఉందని, ఆమె అందాన్ని అది దెబ్బతీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటి ఫై రాశి క్లారిటీ ఇచ్చింది. “నా గత చిత్రాలతో పోల్చిచూస్తే.. ఎడమ కన్ను, ముక్కు ఏదో తేడాగా ఉందని అంటున్నారు చాలామంది. ఓ విషయం చెప్పాలి. మూవీ మేకోవర్ కు, ఇంట్లో లుక్ కు చాలా తేడా ఉంటుంది. సెట్స్ పై లైటింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. షూటింగ్స్ చేసేటప్పుడు వంట పని లేదు. కాబట్టి బాగా నిద్రపోయేదాన్ని. కానీ ఇప్పుడలా కాదు. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. పైగా శుభాకాంక్షలు సినిమాకు ఇప్పటికీ చాలా ఏళ్లు గడిచిపోయాయి. కాబట్టి వయసు వల్ల వచ్చిన మార్పు కావొచ్చు. అంతే తప్ప.. అంతా ఊహించుకునే రేంజ్ లో నాకు కంటి సమస్యలు ఏం లేవు.”

ఇక తన ముక్కు విషయానికొస్తే సినిమాల్లో ఉన్నప్పుడు రాశికి ముక్కుపుడక లేదట. పాప పుట్టినప్పుడు ముక్కు పుడక పెట్టించుకుందట. బహుశా అందువల్ల తన ముక్కు అప్పటికీ ఇప్పటికీ కాస్త తేడాగా కనిపిస్తుందేమోనని అభిప్రాయపడింది రాశి.

Exit mobile version