ప్రస్తుతం ఇండస్ట్రీ లో రాశిఖన్నా బిజీ హీరోయిన్ అయ్యింది..వరుస ఛాన్సులు అమ్మడిని బిజీ హీరోయిన్ ను చేసేస్తున్నాయి. రీసెంట్ గా వెంకిమామ తో సూపర్ హిట్ అందుకున్న రాశి..తాజాగా ప్రతి రోజు పండగే తో మరో సూపర్ హిట్ ను కొట్టి వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ తనలోని టాలెంట్ లను చూపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ భామ ప్రేమలో పడిందనే వార్తలు జోరుగా చక్కర్లు కొట్టడం తో ఆ వార్తల ఫై స్పందించింది. ‘నేను ప్రేమలో ఉన్నానని వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ఇక నాకు కాబోయే వాడి విషయంలో ఎటువంటి కోరికలు కూడా నాకు లేవు. ప్రస్తుతం నా మనసుకు నచ్చేవాడి గురించి ఆలోచించేంత టైమ్ కూడా నాకు లేదు. నేను కెరీర్ పైనే నా దృష్టి అంతా పెట్టాను.
ఇక సినిమాలు కాకుండా నాకు ఆధ్యాత్మికత, పుస్తకాలతోనే టైం గడిచిపోతుందని అన్నారు. దయచేసి ఇటువంటి రూమర్లు పుట్టించవద్దని ఆమె కోరారు.