రానా- మిహికా ల వివాహం రామానాయుడు స్టూడియో లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వివాహ బంధం తో ఒకటయ్యారు. కరోనా వైరస్ కారణంగా వివాహ వేడుకకు పెద్దగా ఎవర్ని ఆహ్వానించలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ.
ఈ వివాహ వేడుకకు చిత్ర సీమా నుండి కేవలం రామ్ చరణ్, శర్వానంద్ , బన్నీ లు వచ్చి సందడి చేసారు. తాజాగా రానా సతీమణి మిహికి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది.ఇప్పుడు మాది కుటుంబం అని కామెంట్ పెట్టింది. ఫోటోలో రానా, మిహికాలు నవ్వుతూ ఫోటోకి ఫోజిచ్చారు. వీరిద్దరితో పాటు వారి పెంపుడు కుక్కని కూడా మనం ఫోటోలో గమనించవచ్చు. మిహికా ఊదా రంగు లెహంగాపై బంగారు ఎంబ్రాయిడీతో కూడిన డ్రెస్ ధరించగా, రానా బూడిద రంగు కుర్తాలో చిరునవ్వు చిందిస్తున్నాడు.