రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా..తాజాగా రానా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు.
ప్రభాస్ విసిరినా ఈ ఛాలెంజ్ ను రానా గురువారం నాడు రామానాయుడు స్టుడియోలో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, మా దగ్గుబాటి కుటుంబ అభిమానులు, ప్రకృతి ప్రేమికులంతా పాల్గొని ముందుకు తీసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాదు.. ఈ సంకల్పానికి నావంతు ప్రయత్నంగా ఎవరు మొక్కలు నాటి నాకు ట్యాగ్ చేసినా రీట్వీట్ చేస్తానంటూ తెలియజేశారు’