Site icon TeluguMirchi.com

ఆ పాత్ర కు రమ్యకృష్ణ భారీ డిమాండ్ ..?

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు వెంకీ కుడుముల భీష్మ చిత్రం ఇచ్చి ఊపిరి పోసాడు. నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నితిన్.. బాలీవుడ్ మూవీ అందదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 6 ఈ మూవీ తెరకెక్కుతుంది. ఒరిజనల్ అందదున్ లో లేడీ విలన్ గా టబు నటించింది. అక్రమ సంబంధం నెరిపే క్రిమినల్ లేడీగా ఆమె పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం హీరో ఆయుశ్మాన్ ఖురానా మరియు టబు చుట్టే తిరుగుతుంది..ఇప్పుడు తెలుగు లోను ఆమెనే తీసుకుంటారని అంత అనుకున్నారు కానీ ఆ తర్వాత రమ్యకృష్ణ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారట. అయితే ఆ పాత్రకు పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట.

రమ్య కృష్ణది ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో రమ్యకృష్ణ భారీగా రెమ్యునిరేషన్ అడుగుతుందట. ఆమె అడిగినదానికి మేకర్స్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

Exit mobile version