Site icon TeluguMirchi.com

రాజ‌ధానిలో రామ‌య్యా.. వ‌స్తావ‌య్యా

ntrబుడ్డోడు బుడ్డోడు అంటే బ‌ట్టలూడ‌దీసి కొడ‌తా – అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఎన్టీఆర్‌. రామ‌య్యా వ‌స్తావయ్యా సినిమాలో. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రమిది. స‌మంత‌, శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌లు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత‌. ఇటీవ‌ల మైసూర్‌లో కొంత‌మేర షూటింగ్ జ‌రిగింది. కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌తో పాటు, రెండు పాట‌ల్ని తెర‌కెక్కించారు. ఈనెల 24 నుంచి హైద‌రాబాద్‌లో మ‌రో షెడ్యూల్ తెర‌కెక్కిస్తారు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేష‌న్‌, యాక్షన్ స‌న్నివేశాలు, పంచ్ డైలాగులు… ఇవ‌న్నీ అద్భుతంగా కుదిరాయ‌ని – త‌మ‌న్ అదిరిపోయే బాణీలిచ్చాడ‌ని చిత్రబృందం చెబుతోంది. సెప్టెంబ‌రులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Exit mobile version