Site icon TeluguMirchi.com

రామ్‌ చరణ్‌కు ఊపిరి ఆడకుండా చేసిన అభిమానులు

ram charanమెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం రాజమండ్రి నుండి కైకలూరు మండంలోని కొల్లేటి కోడ రోడ్డుకు చేరుకుంది. ఆ ఏరియాలో మెగా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో షూటింగ్‌కు నానా అవస్థ పడాల్సి వస్తుందట. అందుకే స్టార్‌ హీరోల చిత్రాలలోని పల్లెటూరి సన్నివేశాలను ఇక్కడ కాకుండా తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలో ప్లాన్‌ చేసుకుంటారు. గోదావరి జిల్లాలోని వాతావరణంలో సినిమాలు చేయడానికి అనుకూలంగా ఉంటాయి కానీ అక్కడి అభిమానాన్ని తట్టుకోవాలంటే సినీ జనాలకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలా అని కొందరు బయట ప్లాన్‌ చేసుకుంటారు కానీ చరణ్‌, సుక్కూ మాత్రం సహజంగా కనిపించాలని కాబోలు ఇక్కడే ప్లాన్‌ చేశారు.

కొల్లేటికోట రోడ్డులో సర్కార్‌ కాల్వపైన చెర్రీ తన ద్విచక్రవాహనానికి ఆయిల్‌ ఇంజన్‌ను కట్టుకుని వ్యవసాయ పనుల కోసం వెళ్లే సన్నివేశాలను తెనకెక్కిస్తున్నారట. రామ్‌చరణ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుంది అని తెలియడంతో అభిమానులు సమీప ప్రాంతా నుండి భారీగా తరలివచ్చారట. అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో షూటింగ్‌కు అంతరాయం కలగడంతో పాటు చెర్రీకి కూడా ఊపిరి మెసలకుండా చేశారట. పాపం అభిమానులు అంతలా మీద మీద పడుతుండడంతో రామ్‌చరణ్‌ నానా అవస్థలు పడ్డాడు అని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Exit mobile version