Site icon TeluguMirchi.com

రామ్ చరణ్ ఐటమ్ రాజానా?

రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. ‘నాయక్’, ‘ఎవడు’ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. మరో వైపు ‘జంజీర్’ షూటింగ్ కుడా జరుగుతోంది. ఈ మూడు సినిమాల్లోనూ ప్రత్యేక గీతాలున్నాయి. ‘ఎవడు’ సినిమాకి సంబంధించి ఐటమ్ పాటను ఇదివరకే విశాఖ పట్నంలో తెరకెక్కించారు. వినాయక్ సినిమా ‘నాయక్‌’లో కూడా తమన్ ఓ ఐటెం గీతాన్ని కంపోజ్ చేసారు. ఈ పాట కోసం ప్రముఖ కధానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు. హిందీ సినిమా ‘జంజీర్’లో మత్తెక్కించే పాట ఉండనే వుంది. చరణ్ కి ముందునుంచి…. ఐటెం పాటల సెంటిమెంట్ వుంది. ‘మగధీర’లో ‘బంగారు కోడి పెట్ట’ పాట… హిట్ అయిన తరవాత ఆ సెంటిమెంట్ ఎక్కువయ్యింది. ‘ఆరెంజ్’లో ఐటెం పాటకు అవకాశం రాలేదు. ‘రచ్చ’లో… అందుకు వీలు దొరికింది. ఆ సినిమా కుడా హిట్టే. దాంతో తన సినిమాల్లో మసాలా పాట ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ‘నాయక్’, ‘ఎవడు’, ‘జంజీర్’… ఈ మూడు సినిమాలూ మంచి ఫలితాలు సాధిస్తే… చరణ్ సెంటిమెంట్ నిజమైనట్టే.

Exit mobile version