మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీ సీక్రెట్స్ బయటకు తెలిపి షాక్ ఇచ్చాడు. నిన్న (ఆగస్టు 15) స్వాతంత్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ.. తన హోమ్ క్వారంటైన్ విశేషాలు, లాక్‌డౌన్ వేళ తన ఇంట్లో నెలకొన్న పరిస్థితులను ఓపెన్‌గా చెప్పేశారు.
కరోనా కారణంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఫుల్ బిజీ అయ్యారు. ముఖ్యంగా డాక్టర్లు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తూ రోగులకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అపోలో హాస్పిటల్ పనులతో ఉపాసన చాలా బిజీ అయిపోయిందని, అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్‌గా ఉన్న తాను ఇంటి నుంచే హాస్పిటల్‌కి సంబంధించిన పనులు చూసుకుంటోందని అన్నారు రామ్ చరణ్. దీంతో కనీసం ఒకరినొకరం కలుసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ఇద్దరం ఓకే ఇంట్లో ఉన్నప్పటికీ.. కేవలం భోజనం సమయంలో మాత్రమే ఉపాసనతో మీట్ అవుతున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.