రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి మాములుగా లేదట..

రానా- మిహికా ల వివాహం రామానాయుడు స్టూడియో లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వివాహ బంధం తో ఒకటయ్యారు. కరోనా వైరస్ కారణంగా వివాహ వేడుకకు పెద్దగా ఎవర్ని ఆహ్వానించలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ.

ఈ వివాహ వేడుకకు చిత్ర సీమా నుండి కేవలం రామ్ చరణ్, శర్వానంద్ మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిలో చరణ్ సందడి బాగా ఉందట. రానాకు చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితుడైన రామ్ చరణ్ ఈ పెళ్లిలో ఫుల్ గా ఎంజాయ్ చేసాడట. భార్య ఉపాసనతో కలిసి పెళ్లి వేడుకను ఎంజాయ్ చేస్తూ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక అదే రేంజ్‌లో సందడి చేసిన మరో జోడీ నాగచైతన్య- సమంత. ఈ జోడీ కూడా రానా పెళ్లిలో కెమెరాలను విపరీతంగా ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.