అభిమానులే నా బలం : రజనీ

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ధూమపానానికి అభిమానులు దూరంగా ఉండాలని సూచించారు. గురువారం రాత్రి రజనీ 62వ జన్మదిన వేడుకల పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అభిమానులతో మాట్లాడుతూ.. పొగతాగే అలవాటుకు స్వస్థిపలకాలని సలహా ఇచ్చాడు. పొగ తాగడం వల్లనే చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని..తాను ఆ అలవాటు వలనే అనారోగ్యానికి గురయ్యానని.. భగవంతుని దయ, అభిమానుల ప్రార్థనలతోనే తాను కోలుకున్నానని రజనీ తెలిపారు. అయితే తాను పొగ తాగే అలవాటును మానుకోలేకపోతున్నానని. మీరు మాత్రం ఈ అలవాటును మానుకోవాలని అభిమానులనుద్దేశించి అన్నారు. రాజకీయాల గురించి కొంత మంది ప్రశ్నించగా రాజకీయాలు అంత సులువేమి కావనీ.. కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రనా రాజకీయ నాయకులు కాలేరని చెబుతూ…తలరాత అంటూ ఒకటుంటే ఏవరైనా ఏపదవైనా చేపడతారని తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు మన సూపర్ స్టార్.