దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో జరిగిన షెడ్యూల్ పూర్తికావడంతో ..నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే వరకు స్వల్ప విరామం ఇచ్చారు జక్కన్న.
ఇదిలా ఉంటె ఈ మూవీ లో శ్రీయ ను ఓకే చేశారట. ఈ విషయాన్నీ స్వయంగా శ్రీయనే తెలిపింది. అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్న శ్రియ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగులో రెండు చిత్రాలకు ఓకే చెప్పానని తెలిపిన ఈ నటి.. అందులో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటని అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో అజయ్ దేవగన్ సరసన తాను నటించబోతున్నట్లు శ్రియ వివరించారు. అయితే శ్రీయ ఈ విషయాన్నీ చెప్పడం ఫై రాజమౌళి ఫైర్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తన గురించి తెలిసి కూడా శ్రియ ఇలా వ్యవహరించడంతో జక్కన్న కాస్త ఎక్కువగానే ఆమె విషయంలో హర్ట్ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో జక్కన్న ఏదైనా షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడా లేదంటే వార్నింగ్ తో సరి పెడతాడా అనేది చూడాలి.