బడ్జెట్ ఫై రాజమౌళి రియాక్షన్..

లాక్ డౌన్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ ఫై గట్టిగా పడింది. గత రెండు నెలల పైగా షూటింగ్ లు , సినిమా థియేటర్స్ బంద్ కావడం తో చిత్ర నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ పడింది. ఈ కారణంగా సినిమాల బడ్జెట్ లలోనే కాకుండా నటి నటుల రెమ్యూనరేషన్ విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీలైనంత వరకు అందరి రెమ్యూనరేషన్ తగ్గించాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

తాజాగా రాజమౌళి సైతం ఇదే కరెక్ట్ అన్నారు. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాల్సిందే.. తప్పదని స్పష్టం చేశాడు. ప్రొడక్షన్ విషయంలో కాకుండా రెమ్యునరేషన్స్ పరంగా తీసుకుంటే సినిమా ఔట్ పుట్‌పై ప్రభావం పడకుండా ఉంటుంది. ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ సూత్రాలు అయితే పాటించాల్సిందే.. కొన్ని రోజులు ఇది తప్పదన్నారు.