లాక్ డౌన్ వేళ సినీ స్టార్స్ అంత పెళ్లి పీటలు ఎక్కడం , పెళ్లికి సంబందించిన అడుగులు వేయడం చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ , నితిన్ , రానా లు పెళ్లి చేసుకోగా..మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం జరిగింది. ‘ఫిదా’ ఫేమ్ రాజా చెంబోలు ఓ ఇంటివాడు కాబోతున్నారు.
సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పెద్ద కుమారుడు. తనకు నిశ్చితార్థం జరిగినట్టు రాజా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘2020లో ది బెస్ట్ పార్ట్ ఇది. నా కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు’’ అని తన పోస్ట్‌లో రాజా పేర్కొన్నారు. అంతేకాదు, ఎంగేజ్డ్ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. రింగ్ ఎమోజీ కూడా చేర్చారు.