Site icon TeluguMirchi.com

పార్కింగ్ షూటింగ్ లొకేషన్ లో హీరో రాజా పుట్టిన రోజు

raja birthdayయంగ్ హీరో రాజా కథానాయకుడుగా భూమిజ సినిమా పతాకంపై మద్దినేని రమేష్ నిర్మాణ సారధ్యంలో ఎ.వి.వి.నాయుడు దర్శకత్వంలో డి.రమేష్ బాబు నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘పార్కింగ్’. ఇప్పటివరకు 50 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో నవంబర్ నెలాఖరుకు రిలీజ్ చేసి, డిసెంబర్ లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజా సరసన షోల్ ఛాబ్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రతి నాయకుడుగా అజయ్ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. కాగా, నవంబర్9న హీరో రాజా పుట్టినరోజు, తన పుట్టినరోజుని ‘పార్కింగ్’ షూటింగ్ లొకేషన్ లో జరుపుకున్నారు. యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు హీరో రాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ షోల్ ఛాబ్రా, త్రిపురనేని చిట్టి, నిర్మాత డి. రమేష్ బాబు, నిర్మాత సారధి మద్దినేని రమేష్, కెమెరామెన్ శ్రీకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version