Site icon TeluguMirchi.com

రాహుల్ రామకృష్ణ సహజీవనం..ఎవరితోనో తెలుసా..?

సైన్మా అనే లఘు చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన రాహుల్ రామకృష్ణ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా ప్రముఖ పాత్ర పోషించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక గీత గోవిందం సినిమా తో ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న రాహుల్..తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం తాను ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్టు తెలిపారు.

2018 అక్టోబర్ 23న తాను జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించారు రాహుల్ రామకృష్ణ. బిందు అనే అభిమానిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు పెళ్లి వార్తను చెప్పిన రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం తన ప్రేయసితో సహజీవనంలో ఉన్నట్టు ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Exit mobile version