Site icon TeluguMirchi.com

వెబ్ సిరీస్ కథలో రాహుల్ బిజీ ..

ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమర్ల హావ బాగా పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌ వంటి అగ్ర సంస్థలు ఓటీటీ రంగంలో దూసుకెళ్తున్నాయి. దీంతో చాలామంది అగ్ర నిర్మాతలు, దర్శకులు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు సొంతంగా ఓటిటి చానెల్స్ ఏర్పటు చేయగా..అగ్ర హీరోలు సైతం ఇదే బాటలో ఉన్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర వెబ్ సిరీస్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట.

ఆహా కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ కు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ వెబ్ సిరీస్ ఏభై ఏళ్ల ముసలోడితో ప్రేమలో పడిన పాతికేళ్ళ అమ్మాయి ప్రేమకథ అని తెలుస్తోంది. ఏభై ఏళ్ల పాత్రలో బ్రహ్మాజీ నటించబోతున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version