వర్మ త్వరగా చనిపోవాలని కోరిన పూరీ

యథా రాజా … తథా ప్రజా.. అన్నది అనాదిగా మనం వింటూ వస్తున్న సామెత. ఇప్పుడా సామెతను నిజం చేసేలాంటి కామెంటొకటి చేశాడు ప్రముఖ తెలుగు దర్శకుడు పూరీ జగన్నాద్‌. ఈ పూరీ మొదట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ శిష్యుడే అన్న సంగతి దాదాపు సినీపరిజ్ఞానం  ఉన్న అందరికీ తెలిసిన విషయమే! అలాగే వర్మ మాటతీరు, కేవలం తన స్టేట్‌ మెంట్లతో వర్మ సృష్టించే సంచలనాలు అందరికీ తెలిసిందే! డిటో తన గురువు లాగే పూరీ కూడా ఓ స్టేట్‌ మెంట్‌ ఇచ్చేశాడు. అదికూడా గురువైన వర్మపైనే! వర్మ ముసలివాడయి పోయిన తరువాత వేరొకరిపైన ఆధారపడి జీవించడం తాను చూడలేని విషయమని, అందుకే తన గురువుగారు ముసలితనం రాకముందే చనిపోవాలని తాను కోరుకుంటున్నానంటూ బాగా గురుభక్తి, ప్రేమ, అభిమానం వగైరాలన్నీ కలిపిన స్టేట్‌ మెంట్‌ ఇచ్చేశాడు పూరీ.. ఇంతకీ ఎక్కడ? అంటే వర్మ జీవితంలోని కొన్ని అంశాలను స్పృశిస్తూ గీతరచయిత సిరాశ్రీ “వోడ్కా విత్‌ వర్మ” అనే ఓ పస్తకం రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే! సదరు పుస్తకానికి ముందుమాట రాయమని పూరీనడిగాడట సిరాశ్రీ. ఆ ముందుమాటలో పైవిధంగా తన గురువు గారైన వర్మపై ఉన్న “………. లు” అన్నీ రంగరించి శిష్యుడు ఫీలయిపోయి ఇలాంటి స్టేట్‌ మెంట్‌ రాసి పారేశాడట మరి. అందుకే మన పూరీ “గురువుని మించిన శిష్యుడు” అనేస్తే పోలా!