కరోనా తో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

కరోనా మహమ్మారి చిత్రసీమను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఆర్థికంగానే కాకుండా ..ప్రాణాలతో కూడా ఆడుకుంటుంది . ఇప్పటికే కరోనా తో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూయగా, తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత, వీ. స్వామినాథన్ కరోనా కారణంగా మరణించారు.

కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లక్ష్మీ మూవీ మేకర్స్‌‌ లో స్వామినాథన్ కూడా ఒకడు.

ఈయనతో పాటు ఆ నిర్మాణ సంస్థలో కె మురళీధరన్, వేణుగోపాల్‌ భాగస్వాములుగా ఉన్నారు. వీరి నిర్మాణంలో ‘అరణ్‌ మనై కావలన్‌’ అనే సినిమాను తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలను నిర్మించిన ఈయన కొన్ని సినిమాలో నటించారు కూడా. ఇక స్వామినాథన్‌ మృతికి పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.