బాక్సు బ‌ద్దలు కొడుతుంద‌ట‌!

Priyamani in Chandi Movieక‌థానాయిక‌గా గ్లామర్ అవ‌తారాలెత్తిన ప్రియ‌మ‌ణి… ఇప్పుడు పోరాట‌ల్లో దిగిపోయింది. చండి సినిమా కోసం. స‌ముద్ర ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో హీరో క‌మ్ హీరోయిన్ గా న‌టిస్తోంది ప్రియ‌మ‌ణి. కృష్ణంరాజు ఓ కీల‌క పాత్రలో క‌నిపిస్తారు. చండీ టీజ‌ర్ మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. టీజ‌ర్‌లో ప్రియ‌మ‌ణి చేత మాస్ డైలాగులు బాగానే ప‌లికించారు. చిరంజీవిలా `బాక్స్‌బ‌ద్దలు కొడ‌తా..` అని కూడా అంది. నా ఫిగ‌రు చూడు బాగుంటుంది, నా పెర్‌ఫార్మెన్స్ చూడాల‌నుకోకు… లాంటి హీరోయిజ‌మ్ పండే డైలాగులూ చెప్పేసింది ప్రియ‌మ్మ‌. ఎలాగూ గ్లామ‌ర్ పాత్రలు ద‌క్కడం లేద‌ని – ఈ టైపు పాత్రల‌కు ఫిక్సయిపోయిందో ఏమిటో..?!