కేజీఎఫ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీ గా ఉన్నాడు. రెండోవ చిత్రంతోనే తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం కన్నడ నిర్మాతలే కాదు మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం ఈయన తో సినిమాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. కానీ ఆ ఛాన్స్ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ కు ఇచ్చాడు ప్రశాంత్. ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ఓ పవర్ ఫుల్ మూవీ చేయబోతున్నాడు.
లాక్డౌన్ సమయంలో ఎన్టీయార్ సినిమాకు సంబంధించిన కథను ప్రశాంత్ దాదాపు సిద్ధం చేశాడట. ఎన్టీయార్‌ను కలిసి కథ వినిపించాడట. అయితే ఎన్టీఆర్ కు ప్రశాంత్ ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. ఈ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ బల్క్ డేట్స్ అడిగాడని ఇపుడు ఫిలింనగర్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
సుమారు ఏడాదిన్నర కాలంపాటు కాల్షీట్లు అడిగాడట. తెలుగుతోపాటు హిందీలో కూడా షూట్ చేయాలని భావిస్తున్నాడట ప్రశాంత్ నీల్. కరోనా ప్రభావంతో ఇప్పటికే ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ ఎప్పుడు షురూ అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు. ఈ చిత్రం పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా ఉంది. మరి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.