కేజీఎఫ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడగా, ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
తాజాగా చిత్రయూనిట్ తో ఉన్న ఫొటో ఒకటి ట్విటర్ లో షేర్ చేసింది. దీన్ని పూర్తి చేద్దామని ప్రశాంత్ నీల్ ఇన్స్టా గ్రామ్ లో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 2021 సంక్రాంతి బరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గనులు. ఆ గనుల పై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్న దానిని తొలి భాగంలోనే అద్భుతంగా చూపించారు దర్శకుడు. ఇక పార్ట్ 2 లో ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించనున్నట్టు తెలుస్తుంది. కేజీఎఫ్ 2 చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు.