
కేజీఎఫ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీ గా ఉన్నాడు. రెండోవ చిత్రంతోనే తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం కన్నడ నిర్మాతలే కాదు మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం ఈయన తో సినిమాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. కానీ ఆ ఛాన్స్ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ కు ఇచ్చాడు ప్రశాంత్. ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ఓ పవర్ ఫుల్ మూవీ చేయబోతున్నాడు.
లాక్‌డౌన్ సమయంలో ఎన్టీయార్ సినిమాకు సంబంధించిన కథను ప్రశాంత్ దాదాపు సిద్ధం చేశాడట. ఎన్టీయార్‌ను కలిసి కథ వినిపించాడట. ఈ సినిమా పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన తర్వాత 2022 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.