స్పోర్ట్స్ డ్రామా సిద్ధం చేస్తున్న లోకల్ రైటర్

నేను లోకల్, హలొ గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలకు రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ ప్రస్తుతం ఇండస్ట్రీ బిసి రైటర్ అయ్యాడు. ప్రస్తుతం ఒక స్పోర్ట్స్ డ్రామా రాస్తున్నట్టు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున అవార్డు గ్రహీత ప్రముఖ వాలీ బాల్ ప్లేయర్ అరికపూడి రామారావు జీవితంపై
కథ రాస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఈ కథతో పలువురు నిర్మాతలను కలవనున్నారు. ప్రస్తుతం రవితేజ మరియు త్రినాథరావు నక్కినలతో చేయనున్న ఓ ప్రాజెక్ట్ కు పని చేస్తున్నారు.