లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. మూడు నెలల వరకు ఉపశమనం కల్పించింది. విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కొందరు ఆన్లైన్లో చెల్లించినప్పటికీ, మరికొంతమంది కట్టకుండా ఉన్నారు . కాగా ఇప్పుడు మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి ఇవ్వడం తో షాక్ అవుతున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సెలబ్రటీస్ వరకు తమకు వచ్చిన బిల్లులు వామ్మో అంటున్నారు.
ఈ నేపథ్యంలో నటి స్నేహ భర్తకి రూ.70 వేల విద్యుత్ వచ్చిందట. ఇంత మొత్తం నేను కట్టగలను. సామాన్యులు, మధ్య తరగతి వాళ్ల పరిస్థితి ఏంటి? మా ఇళ్ళకి రెండు నెలలకి వచ్చే బిల్లుల కంటే ఈ సారి వచ్చిన బిల్లు పలు రెట్లు అధికంగా ఉంది అని ప్రసన్న తెలుపడం తో .. మీటర్ రీడింగ్‌లో తప్పులు దొర్లాయి. సరిచేసి కొత్త బిల్లు పంపిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.