Site icon TeluguMirchi.com

‘బుజ్జి గాడు’ ‘డార్లింగ్’ కు పదేళ్ళు

‘ఈశ్వర్‌’ సినిమాతో వెండి తెర ప్రయాణం మొదలుపెట్టిన ప్రభాస్ కెరీర్ కి ఈ రోజు తో పదేళ్లు పూర్తవుతున్నాయి. తొలి సినిమాతోనే తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తరువాతి దశ లో ‘వర్షం’ తో లవర్ బాయ్, యాక్షన్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ‘క్రిష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన  చక్రం’ సినిమాతో తనలోని విభిన్న కోణాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు. అయితే తనని పూర్తి స్థాయి యాక్షన్ హీరోని చేసింది దర్శక ధీరుడు రాజమౌళినే. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ ప్రభాస్ కెరీర్ లోనే ఆత్యంత యాక్షన్ చిత్రం గా నిలవడమే కాకుండా ప్రభాస్ ను ఓ  మాస్ హీరోను చేసింది. ప్రస్తుతం  ఆయన దృష్టి మొత్తం తాజా చిత్రం ‘మిర్చి’ పైనే ఉంది. ప్రభాస్ మరింత కాలం మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలని తెలుగు మిర్చిడాట్ కాం కోరుకుంటుంది
Exit mobile version