పోసాని బాలయ్య కు సపోర్ట్ చేశాడా..? చిరంజీవికా..?

రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యాయి. కొంతమంది బాలయ్య ను విమర్శిస్తే..మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

తాజాగా పోసాని కృష్ణ మురళి ఈ వ్యవహారం ఫై స్పందించారు. బాలయ్యకు కోపం కాస్త ఎక్కువే, ఆ కోపానికి ఒక కారణం ఉంటుంది అంటూ ఆయన మాట్లాడారు. ఏదైనా బాలయ్య మొఖం మీద మాట్లాడతారని, ఉన్నది ఉన్నట్టుగా చెబుతారని, మేకప్ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా స్పందిస్తారని, చాలా మంచి మనిషి అని, అవినీతి అక్రమాలు పాల్పడాలనే తత్వం కాదని పోసాని అన్నారు. ఇక అన్న నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఎన్టీఆర్ కొడుకులు అందరూ చాలా కష్టపడి పైకి వచ్చారని, బాలయ్య అందరిని చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు.ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ చిరంజీవి చాలా మంచివారని, అందరిని తన వారిలా చూసుకుంటారని అన్నారు. ఆయనతో కలిసి ఖైదీ నెం 150 సినిమా చేసానని, ఆయన నటించిన ‘అల్లుడా మజాకా’ సినిమా తానే కథను అందించానని పోసాని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద స్టార్స్ అయినా చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరు మంచి వారే అని పోసానిచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.