Site icon TeluguMirchi.com

తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటుదాం..!

Ponnala-lakshmaiah1హైదరాబాద్ లో ఈ నెల 30న తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా.. తెలంగాణ ఆకాంక్షను మరోసారి చాటుదామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 30న హైదరాబాద్ లో తలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ మంత్రులు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version