పూజా తాజా పోజ్ చూసారా..?

వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బుట్టబొమ్మ పూజా హగ్దే..ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది. ఇంట్లో ఊరికే ఉంటె బోర్ కొడుతుందో ఏమో వాటిలో సరికొత్త వంటలను సిద్ధం చేస్తుంది. తాజాగా చెఫ్ అవతారమెత్తింది. వంట గదిలో దూరి గరిట తిప్పి ఆ మధ్య స్వీట్ హల్వా మరియు పిజ్జా తయారు చేసింది. ఆ మధ్య తండ్రికి బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చేందుకు స్వయంగా తనే కేక్ రెడీ చేసింది.

ఇవే కాకుండా గిటార్ వాయించడం కూడా నేర్చుకుంది. ఇలా తనలోని మల్టి టాలెంట్ లను బయటకు తీస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. తాజాగా వంగుతూ నమస్కరించి దండం పెడుతూ సరికొత్త పోజ్ ఇచ్చింది. ఈ పోజ్ కు నెటిజన్లు ఫిదా అవుతూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.