రాజధాని మార్పు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఈ బిల్లులకు సంబంధించి పీఎంవో వివరాలు కోరింది. హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై స్పందించిన పీఎంవో గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్టు తెలిసింది.
ఈ రెండు బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపిన ప్రతిపాదనలను ప్రధాని కార్యాలయానికి హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి పంపారు. దీనిపైనే పీఎంవో గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగింది