Site icon TeluguMirchi.com

ప్లీజ్ మా సినిమాను ఒక్కసారి చూడండి

అజయ్ దేవగణ్‌, సోనాక్షి సిన్హా జంటగా అశ్విని ధీర్ దర్శకత్వంలో రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం  ‘సన్ ఆఫ్ సర్దార్’. ఈ చిత్రం దీపావళి సంర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌ టాక్ ను సంపాదించుకుంది. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు అశ్విని ధీర్  మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ తీసిన ఎస్.ఎస్ రాజమౌళి చూడాలని, అలాగే మేము చేసిన మార్పులు ఎలా ఉన్నాయో అనే దాని మీద ఆయన అభిప్రాయం చెప్పాలని అశ్విని ధీర్ తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీ నేటివిటీలోకి మార్చడానికి చాలా మార్పులు జరిగాయని, అజయ్ మార్కు కామెడీ ఇందులో ఉంటుందని ధీర్ అన్నారు.
Exit mobile version