బడ్జెట్ లో పెట్రో షాక్…!

ఈ బడ్జెట్ లో అయినా పెట్రో ధరలు దిగొస్తాయనుకున్న వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం.
ఇప్పటికే పెట్రోల్‌ ధరలు పరుగులు పెడుతుండగా బడ్జెట్‌లో ఇంధన ధరలపై సెస్‌ విధించడంతో ఇవి మరింత భారం కానున్నాయి. ప్రతి లీటర్‌ పెట్రో పై రూ.1 అదనంగా బడ్జెట్‌లో సెస్‌ విధించారు.

పెట్రో సెస్ ద్వారా కేంద్రానికి రోజూ దాదాపు రూ 200 కోట్ల రాబడి సమకూరుతుండగా సామన్యుడికి మాత్రం సెగలు పుట్టిస్తుంది. ఇంధన ధరలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు భారమై నిత్యావసరాల ధరల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.