Site icon TeluguMirchi.com

పెట్రో బాదుడు మాములుగా లేదు

మరోసారి పెట్రో బాదుడు..సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆరో రోజు మంగళవారం కూడా పెట్రో ధర పెరిగి ..వాహనదారులకు చుక్కలు చూపించాయి.

ఆగస్టు 16 నుండి చమురు కంపెనీలు (ఆగస్టు 19 తప్ప) మెట్రోల్లో పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. అయితే, దాదాపు ఒక నెలరోజుల నుంచి డీజిల్ ధరలో మార్పులేదు. మంగళవారం ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోల్ రేటు 9-11 పైసలు పెరిగింది. ప్రస్తుతం జంట నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

పెట్రోల్ ధర లీటరుకు :

ఢిల్లీలో 81.73రూపాయలు
ముంబైలో 88.39 రూపాయలు
చెన్నైలో 84.73 రూపాయలు
కోల్‌కతాలో 83.24 రూపాయలు
హైదరాబాద్‌లో 84.94 రూపాయలు
బెంగళూరులో 84.39 రూపాయలు

డీజిల్ ధర లీటరుకు :

ఢిల్లీలో 73.56 రూపాయలు
ముంబైలో 80.11 రూపాయలు
చెన్నైలో 78.86 రూపాయలు
కోల్‌కతాలో 77.06 రూపాయలు
హైదరాబాద్‌లో 80.17 రూపాయలు
బెంగళూరులో 77.88 రూపాయలు

Exit mobile version