చిరంజీవి కి పవన్ ఎలా విషెష్ తెలిపాడో తెలుసా..?

మెగా స్టార్ చిరంజీవి 65 వ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా మెగా అభిమానులు , సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ అందిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్బంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేసి అందర్నీ కట్టిపడేసాడు.

అన్నయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి ప్రదాత. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంతలా ఆరాధిస్తానో పూజ్యులైన అన్నయ్యను కూడా అంతే ప్రేమిస్తాను. నా అన్నయ్య వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఆయనే నాకు తొలి గురువు. అన్నయ్య ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఆవిర్భవించారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించారు. ఆయనలా నటుడవుదామని ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. ఎందరికో స్ఫూర్తినిచ్చి ఆపన్నులకు అండగా ఉన్న మీలాంటి కృషి వలునికి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. మీరు చిరాయువుతో సుఖ శాంతులను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ అన్నయ్యకు ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.