సినీ నటుడు పవన్ కళ్యాణ్ సేంద్రీయ పద్ధతులలో పండించిన మామిడికాయలు తన సన్నిహితులకు ప్రతి ఏడాది పంపిస్తుంటాడనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ఆలీకి పవన్ మామిడికాయలు పంపించలేదని అలీ తెగ ఫీల్ అవుతున్నాడు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, అలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు.
తాజాగా అలీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘పవన్ కల్యాణ్‌గారికి నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ అన్నా, హావభావాలు అన్నా ఆయన బాగా ఇష్టపడతారు. మేము ఏదైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు సీక్రెట్‌గా సైగలు చేసుకుంటూ ఉంటాం. ఆ సైగలు ఎవ్వరికీ తెలియవు. దాదాపు ఆయన నటించిన అన్ని చిత్రాలలో నేను నటించాను. అన్నయ్య చిరంజీవిగారి కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కళ్యాణ్‌గారు ఆప్యాయంగా పలకరించేవారు. అప్పటికి ఆయన సినిమాల్లోకి రాలేదు. ఆయన సినిమాలలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ‘తొలిప్రేమ’ చిత్రం నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడింది. ప్రతి సంవత్సరం అన్నయ్య చిరంజీవిగారు ఆవకాయ పచ్చడి పంపిస్తారు. పవన్ కల్యాణ్‌గారు సేంద్రీయ పద్ధతులలో పండించిన మ్యాంగోస్ పంపుతారు. కానీ ఈ సంవత్సరం ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల పంపలేదు. వచ్చే సంవత్సరం పంపుతారని అనుకుంటున్నాను..’’ అని అలీ చెప్పుకొచ్చారు.