పవన్ కళ్యాణ్ వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో వకీల్ సాబ్ చిత్రం తో పాటు , క్రిష్ డైరెక్షన్లో విరూపాక్ష మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా , విరూపాక్ష మూవీ మాత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ నెలలో రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో మొదలవ్వాల్సి ఉండగా, కరోనా వచ్చి షూటింగ్ కు బ్రేక్ పడేలా చేసింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న తరుణంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కరోనా ఉదృతి తగ్గే వరకు ఏ సినిమా షూటింగ్ లో జాయిన్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట. ఒకవేళ కరోనా తగ్గినా తర్వాత ముందుగా వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేస్తాడట. ఆ తర్వాతే క్రిష్ మూవీ అని చెప్పాడట. ఈ లెక్క చూస్తే క్రిష్ మూవీ సెట్స్ పైకి వెళ్ళేది వచ్చే ఏడాదే అని ఫిక్స్ అయ్యారట. అందుకే క్రిష్ మరో మూవీ ని మొదలుపెట్టాడని అంటున్నారు.