ప్రారంభమైన పవర్ స్టార్ కొత్త సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల సూపర్ హిట్ కాంబినేషన్ లో భారీ నిర్మాత ‘ఛత్రపతి’ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పై. లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ నవంబర్ 23 ఉదయం ఫిల్మ్ నగర్ టెంపుల్ లో ఉదయం 10.17 నిమిషాలకు ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, స్టార్ రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా తొలి షాట్ ను వెంకటేశ్వర స్వామి విగ్రహంపై చిత్రీకరించారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ గారితో ‘సుస్వాగతం’ రోజుల నుంచి మంచి సినిమా చెయ్యాలన్న కోరిక వుంది. అది ఇన్నాళ్ళకు నెరవేరింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇది ఓ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ మాస్ టచ్. పవన్ కళ్యాణ్ గారి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ సెకండాఫ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది” అన్నారు. ‘జల్సా’ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫొటో గ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ, ఫైట్స్ : రామ్ –లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్.