Site icon TeluguMirchi.com

పవన్ గడ్డం కథేమిటి?

pavan lookసినిమా సినిమాకీ కొత్తగా కనిపించడం పవన్ కళ్యాణ్ కు ముందు నుంచీ ఉన్న అలవాటు. పాత్ర తీరుతెన్నులను అనుసరించే ఆయన వేషధారణ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ‘జానీ’ నుంచీ ఆయన గెటప్పుల్లో కొత్తదనం కనిపిస్తూ వచ్చింది. ఆ సినిమా కోసం ఆయన మీసాల్ని ట్రిమ్ చేశారు. అంతే కాదు… బరువు తగ్గి చాలా సన్నగా కనిపించారు. ‘గుడుంబా శంకర్’ తో మళ్లీ మాస్ లుక్ వచ్చేసింది. ఈ మధ్య ‘పంజా’ కోసం తొలిసారి గెడ్డం పెంచారు. ఆ సినిమా మాఫియా నేపథ్యంలో సాగే కథ కాబట్టి… గెడ్డం ఆ సినిమాకి సూట్ అయ్యింది. ‘జల్సా’, ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ లలో మరింత అందంగా ముస్తాబయ్యారు. ఆయా సినిమాల్లో పవన్ ని చూసి. ‘ఖుషి’నాటి రోజులు గుర్తొచ్చాయని ఆయన అభిమానులు తెగ సంతోషపడ్డారు.

ఇప్పుడు మళ్లీ పవన్ గడ్డం పెంచుతున్నారు. ‘నాయక్’ ఆడియో వేడుకకు వచ్చిన పవన్ ని చూసి… ముందు అభిమానులు షాక్ అయ్యారు. ‘పవన్ ఏమిటి? గడ్డం పెంచాడు’ అనే ముక్కున వేలేసుకొన్నారు. ఆ లుక్ లో రగ్గడ్ గా కనిపిస్తున్నారు పవర్ స్టార్! ఇదంతా త్రివిక్రమ్ సినిమా కోసమేనా? ? అని అభిమానులు ఆరా తీయడం కనిపించింది. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. ‘నాయక్’ వేడుక కోసమని ఆయన షూటింగ్ ని వాయిదా వేసుకొని వచ్చారు. కాబట్టి… ఆ గడ్డం త్రివిక్రమ్ సినిమా కోసమే అని చెప్పుకొంటున్నారు. అంటే…పవన్ ని త్రివిక్రమ్ తన సినిమాలో రగ్గడ్ పాత్రలో చూపించబోతున్నారా? ? పవన్ కోసం మరో మాఫియా కథ రాశారా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘జల్సా’లో పవన్ నక్సలైట్ గా మారిన సన్నివేశాల్లో గడ్డంతో కనిపిస్తారు. ఈ సినిమాలో అలాంటి ఛాయలు ఏమైనా ఉన్నాయా? ఈ సంగతి త్రివిక్రమ్-పవన్ లకే తెలియాలి. అన్నట్టు ఈ సినిమా ‘నువ్వునాకు నచ్చావ్’ తరహాలో సాఫీగా సాగిపోయే కుటుంబ కథాచిత్రమని మరో వర్గం చెబుతోంది. ఈ రెండింటిలో ఏది నిజమో తేలాలంటే… కనీసం ఫస్ట్ లుక్ వరకు ఆగాల్సిందే.

Exit mobile version