Site icon TeluguMirchi.com

ఉత్తమ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Gabbar-Singh2నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ గ‌బ్బర్‌సింగ్‌లో హ‌డావుడి చేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ సినిమాలో ప‌వన్ స్టైలింగ్‌, మాట తీరు, న‌ట‌న‌.. అన్నీ.. అభిమానుల‌కు తెగ న‌చ్చేశాయ్‌. ఇప్పుడు జ్యూరీ కూడా ప‌వ‌న్ న‌ట‌న‌కే ఓటేశాయి. మాటీవీ 2013 అవార్డుల్లో ఉత్తమ న‌టుడు పుర‌స్కారం ప‌వ‌న్‌కే ద‌క్కింది. ప‌వ‌న్‌కి మాటీవీ అవార్డు ద‌క్కడం ఇదే తొలిసారి. ఉత్తమ చిత్రంగా గ‌బ్బర్ సింగ్ ఎంపికైంది. ఉత్తమ ద‌ర్శకుడు హ‌రీష్ శంక‌ర్ పుర‌స్కారం అందుకొన్నారు. ఉత్తమ న‌టిగా కాజ‌ల్ (తుపాకీ) అవార్డు అందుకొంది.

Exit mobile version