వెంకి – పవన్ కాంబినేషన్ లో మరో మల్టీ స్టారర్

ప్రిన్స్ మహేష్ బాబు తో కలిసి ప్రస్తుతం ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాలో నటిస్తున్న తాను త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతున్నానని, ఆ సినిమా కథ శరవేగంతో తయారవుతోందని ‘విక్టరి’ వెంకటేష్ తెలిపారు. యువహిరోలతో కలిసి నటించేందుకు తాను ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. ‘ కృష్ణం వందే జగద్గురుం ‘ చిత్రంలో ఒక పాటలో రానా తో కలిసి స్టెప్పులు వేశానని, వెంటనే మరో చిత్రంలో తామిద్దరం కలిసి నటించే అవకాశం లేదని వెంకి చెప్పారు. వయసును బట్టి తాను పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటున్నానని, ఇప్పుడు కూడా తాను కుర్ర పిల్లలతో డ్యాన్సులు వేస్తే జనం అంగీకరించరని, ఒకవేళ అలాచేస్తే మీడియా నే తనను మోసేస్తుందని ఆయన నవ్వుతూ అన్నారు.పవన్ కళ్యాణ్ తో కలిసి చేయబోయే సినిమా కూడా ‘ సీతమ్మ వాకిట్లో ……’ లానే కుటుంబ కదా చిత్రమా అని ఆయనను అడగగా ‘చూస్తారుగా’ అంటూ సమాధానం దాటవేశారు. సో….త్వరలోనే మరో మల్టీ స్టారర్ వెంకి, పవన్ ల కాంబినేషన్లో రాబోతోందన్న వార్త అటు వెంకటేష్ అభిమానులకు, ఇటు పవర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభ వార్తే….!