సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు..ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ పరుశురాం తో చేయబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. సర్కారు వారి పాట అనే క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ కాబోతోందట. దీనికి తగ్గట్టే మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు పరశురామ్ అందుకుంటున్న పారితోషికం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఒకటి రెండు కాదు.. మహేష్ సినిమాకు పరశురామ్ ఏకంగా 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో 20% షేర్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముందుగానే నిర్మాతల నుంచి 4 కోట్లు అడ్వాన్స్ అందుకోబోతున్నాడని.. విడుదలైన తర్వాత మిగిలిన పారితోషికంతో పాటు లాభాలు కూడా ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాకు మంచి లాభాలు వస్తే పరశురామ్ పారితోషికం ఈజీగా 10 కోట్లు దాటిపోవడం ఖాయం.