టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..శుక్రవారం ఉదయం గుండె పోటుతో హైదరాబాద్లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.